సూపర్ హిట్ “ఏ మాయ చేసావే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న “యశోద ” మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ చైతన్య నుంచి విడిపోతున్నానని ప్రకటించిన తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ట్రోలింగ్ కి గురైందో తెలిసిందే. చైతన్యతో బ్రేకప్ కి కారణం ఏదైనా కానీ సమంత ఒక్కరినే బాధ్యురాలిని చేస్తూ ట్రోల్స్ ఎదురయ్యాయి. ఆమెను టార్గెట్ చేస్తూ ఎన్నో కామెంట్లు చేసారు. విడాకుల విషయంలో చైతన్య తప్పు ఎంతమాత్రం లేదనీ సమంత కారణంగానే వివాహ బంధం వీగిపోయిందని రకరకాల కామెంట్లతో ఆమెను ఎంతగానో బాధించారు. వాటిని సమంత ఎంతో ధైర్యంగా ఎదుర్కుని , ప్రతీ కామెంట్ ని పాజిటివ్ గా తీసుకుని ఎవరి మనసు నొప్పించకుండా కెరీర్ పై పూర్తిగా ఫోకస్ పెట్టి తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటున్నారు.ఒక ఇంటర్ వ్యూ లో సమంత ట్రోలింగ్ పై స్పందించారు. తన మాటలతో అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదనీ , తాను షరతులను, అంగీకారాన్ని డిమాండ్ చేయననీ , విభిన్న అభిప్రాయాల్ని కలిగి ఉండమని ఎవరిని ప్రోత్సహించననీ , కానీ ఇప్పటికీ మనం ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు, కరుణించవచ్చుననీ , వారి నిరుత్సాహాన్ని మరింత సభ్యతగా వ్యక్తం చేయమని మాత్రమే తాను అభ్యర్ధిస్తున్నా ననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































