కరోనా వల్ల గత రెండేళ్లు టాలీవుడ్ లో కళ కాస్త తప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మళ్లీ సినిమాల రిలీజ్ లు, టీజర్లు, ట్రైలర్ల రిలీజ్ లతో సందడి మొదలైంది. గత రెండు మూడు నెలల నుండే కాస్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా అసలైన జాతర ఇప్పటినుండి మొదలవ్వబోతుంది. నిజానికి ప్రతి ఏడాది ప్రథమార్థంలో సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. కానీ ఈసారి మాత్రం ఏడాది చివరి నుండి ఆ సందడి మొదలైంది. వచ్చే నెల అంటే డిసెంబర్ లో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి రెండు తప్పించి మిగిలినవి మాత్రం పెద్ద హీరోల సినిమాలే. వాటిలో మరీ ముఖ్యంగా అందరూ ఆసక్తికా ఎదురుచూసే సినిమా పుష్ప- ది రైజ్ కోసం. దాని తర్వాత బాలయ్య అఖండ, నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ గని, సత్యదేవ్ స్కైలాబ్, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి వీటితో పాటు పలు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో స్కైలాబ్ డిసెంబర్ 4న, గుడ్ లక్ సఖి డిసెంబర్ 10న, అఖండ డిసెంబర్ 2న, పుష్ప డిసెంబర్ 17న, గని డిసెంబర్ 24, శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న రిలీజ్ కాబోతున్నాయి. ఒక రకంగా సినీ లవర్స్ కు పెద్ద పండగలాంటిదే. మరి ఈసినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”70056″]
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























