టాలీవుడ్ హీరోలు ఒకరికొకరు ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ప్రత్యేక సందర్భాల్లో ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా మనకు తెలిసిందే. ప్రతి ఏడాది సమ్మర్ వచ్చిదంటే చాలు ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి పవన్ కళ్యాణ్ తమ తోటలో కాసే మామిడి పండ్లను పంపిస్తూ ఉంటారు. ఇక ఈసారి దీపావళి సందర్భంగా పవన్ అందరికీ బహుమతులు పంపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా.. శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు సినీ ప్రముఖులకు కానుకలు పంపారు పవన్ కల్యాణ్. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఈ గిఫ్ట్ అందించారు. ఇందులో పలు స్వీట్స్ తో పాటు పలు క్రాకర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కానుకలు పంపినందుకు పవన్-అన్నాకు థ్యాంక్స్ చెప్పారు.
ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. వీటితోపాటు హరీష్ శంకర్ సినిమా కూడా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: