యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లో రూపొందుతున్న ఈసినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్ఫంగా సంతోష్ శోబన్ మాట్లాడుతూ అసలు తనకి సినిమా అంటే ఏంటో పెద్దగా తెలియదు ఎలా తీస్తారు అనేవి తెలియని సమయంలో తెలిసిన ఒకే ఒక్క పేరు ప్రభాస్. ప్రభాస్ అన్న వల్లనే నేను కూడా నటుడిని కావాలని ఇండస్ట్రీకి రావాలనుకున్నాను అని ఈ యంగ్ హీరో తెలిపాడు.
ఇక సంతోష్ శోభన్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సపోర్ట్ ను మొదటి నుండీ అందిస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ వర్షం సినిమాను అందించిన శోభన్ తనయుడు సంతోష్ శోభన్. శోభన్ తో ప్రభాస్ కు మంచి రిలేషన్ ఉంది. అయితే ప్రస్తుతం శోభన్ లేకపోవడంతో ప్రభాస్ మాత్రం తన ఫుల్ సపోర్ట్ ను ప్రభాస్ కు అందిస్తున్నాడు. అంతేకాదు యూవీ క్రియేషన్స్ లో కూడా సినిమాలు చేయడానికి అవకాశాలు ఇస్తున్నాడు. చూద్దాం మరి ఈ యంగ్ హీరో ఈసినిమాతో మరో మెట్టు పైకి ఎక్కుతాడేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: