నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా నటించిన “లవ్ స్టోరీ”మూవీ ఘనవిజయం సాధించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిట్ నెస్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ .. సినిమాల్లోకి రావడానికి ముందుగానీ , ఆ తరువాత గానీ జిమ్ కి వెళ్లలేదనీ , అసలు జిమ్ ఎలా ఉంటుందో కూడా తాను నేరుగా చూడలేదనీ , తాను ఎప్పుడూ వర్కౌట్లు చేసింది లేదనీ , తనకు తెలిసింది డ్యాన్స్ మాత్రమే ననీ , స్ట్రెస్ ఫీలైనప్పుడు , ఖాళీ దొరికినప్పుడు , షూటింగు గ్యాప్ లోనూ డ్యాన్స్ ఎక్కువగా చేస్తుంటాననీ , ఎక్స్ పర్ట్స్ కూడా వర్కౌట్స్ చేయడం కంటే డ్యాన్స్ చేయడం మంచిదనే చెప్పారనీ , మంచి ఫిట్ నెస్ కోసం , బాడీ షేప్ కోసం డ్యాన్స్ కి మించినది లేదనీ , ప్రతిరోజు తాను డ్యాన్స్ చేస్తూనే ఉంటాననీ , ఎలాంటి పరిస్థితుల్లోను డాన్స్ విషయంలో అశ్రద్ధ చేయననీ , తన ఫిట్ నెస్ రహస్యం కూడా అదే అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: