బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్ “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, ఓంరౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.”సలార్ ” మూవీ 2022 ఏప్రిల్ 14 వ తేదీ , “ఆది పురుష్“మూవీ 2022 ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ హీరోగా రూపొందే 25 వ మూవీ అనౌన్స్ కానుంది.ఈ అయిదు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు కలిగి ఉన్నాయి. ఈ అయిదు సినిమాలు రెండు వేల కోట్ల వరకు వసూళ్లు చేస్తాయనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ఒక ఇండియన్ హీరో రెండేళ్లలో రెండు వేల కోట్ల వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ సన్నిహితులు, అభిమానులు రాబోయే రెండు సంవత్సరాల్లో బాక్స్ ఆఫీస్ కింగ్ ల ఉంటారనీ , ఆరెండేళ్లకు గాను నెం.1 స్టార్ గా నిలవడం ఖాయం అంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: