బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన ఫ్యూచర్ ప్లాన్స్ పై స్పందించారు. సినిమాలు మాత్రమే కాకుండా పాత్ర నచ్చితే వెబ్ సిరీస్ లలో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. తాను హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటిగా కొనసాగాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి మరోసారి వెబ్ సిరీస్ కు ఓకే చెప్పబోతున్నట్లుగా ప్రకటించారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























