టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలకు జంటగా నటించిన రకుల్ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అంతటి బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు తగ్గాయని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారికి సమాధానం అన్నట్లుగా రకుల్ తన సినిమాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో రెండు భారీ ప్రాజెక్ట్ లకు రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న ఆ రెండు ప్రాజెక్ట్స్ లో “లేడీస్ నైట్”ఒక మూవీ కాగా రెండవ ప్రాజెక్ట్ కు టైటిల్ ఫిక్స్ కాలేదు. అక్టోబర్ చివర్లో ఈ ప్రాజెక్ట్ లు పట్టాలెక్కబోతున్నాయి. మొత్తానికి రాబోయే రెండు మూడు ఏళ్ల వరకు కూడా రకుల్ ఫుల్ బిజీగానే ఉంటారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























