కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసాను.. థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమా కూడా రెండు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమ పోరాటం అని తెలుస్తుంది. ఇందులో లైటింగ్ సూరిబాబుగా సుధీర్ కనిపిస్తుండగా.. సోడాల శ్రీదేవి గా హీరోయిన్ ఆనంది కనిపించింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన సూరిబాబు – శ్రీదేవి లు ప్రేమించున్న తర్వాత ఏర్పడిన పరిస్థితులు.. చోటు చేసుకున్న పరిణామాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ‘శ్రీదేవికి పెళ్లి చేసేస్తారురా.. శ్రీదేవి నాది.. ఎప్పటికీ నాదే..’ అంటూ సుధీర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Here’s the trailer of #SrideviSodaCenter Absolutely enjoyed it! Looking forward to its release in the cinemas. Good luck to @isudheerbabu and the entire team!https://t.co/Ykox3cYwIf@anandhiactress @70mmEntertains @Karunafilmmaker #ManiSharma
— Mahesh Babu (@urstrulyMahesh) August 19, 2021
కాగా ఈసినిమాలో ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























