మెగాస్టార్చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఇక
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా వల్ల బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా తిరిగి మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. అన్నీ పరిస్థితులు బావుండే ఈనెల 13 న ఈసినిమా రిలీజ్ అయ్యేది కానీ కరోనా వల్ల అది కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా టాకీ పార్ట్ చేసుకుందని.. ఇంకా రెండు పాటలు పూర్తి చేసుకోవాల్సి ఉందని అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అలాగే లాహే లాహే అన్న పాటను కూడా రిలీజ్ చేయగా అది ఇప్పుడు ఎంత వైరల్ అయిందో చూస్తూనే ఉన్నాం.
Talkie of the most awaited film #Acharya has been completed. Shooting of two songs is yet to be completed.
Megastar @KChiruTweets @AlwaysRamCharan #KoratalaSiva @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/jpZEBTGFQ6
— Konidela Pro Company (@KonidelaPro) August 4, 2021
కాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. చూద్దాం దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























