టాలీవుడ్ లో ప్రస్తుతం పలు మల్టీ స్టారర్ సినిమాలు వస్తుండగా అందులో పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాపై కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. పవర్ స్టార్ అంటేనే సూపర్ క్రేజ్ ఉంటుంది.. దానికితోడు రానా లాంటి టాలెంటెడ్ నడుట కూడా నటిస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే షూటింగ్ ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా దీంతో పవర్ స్టార్ క్రేజ్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ తో చేస్తున్న రానా కూడా పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పవన్ సెట్స్ లోకి రావడమే చాలా అనుభవంతో వస్తారని సినిమాపై ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందని.. పవన్ సినిమాని ఒక కొత్త కోణంలో చూస్తారని.. తనతో ఫస్ట్ టైం చేస్తున్నా.. ఫస్ట్ టైం ఎక్స్ పీరియన్స్ చాలా కొత్తగా చాలా గౌరవంగానూ గొప్ప అనుభవంగా అనిపిస్తుందని తెలిపాడు. అంతేకాదు ఆయనతో మాట్లాడిన ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాని రానా తెలిపాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: