డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ “రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషనల్ ఫెస్టివల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. “రోర్ఆఫ్ఆర్ఆర్ఆర్” పేరుతో మేకింగ్ వీడియో గ్లింప్స్ ని జూలై 15 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు రాజమౌళి ఒక ప్రమోషనల్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ అలియా భట్ 20 వ తేదీ ముంబై నుండి హైదరాబాద్ కు చేరుకొని ఈ రోజు “RRR”సెట్స్ లో జాయిన్ అయ్యారు . అలియా భట్ తాను “RRR”సెట్స్ లో జాయిన్ అయినట్టుగా అభిమానులకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: