తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా తన అందం, ఆరోగ్యానికి కారణమైన ఆహారపు అలవాట్లను గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలను పంచుకున్నారు. రాత్రి భోజనం మానేయడం చాలా కష్టంగా అనిపించిందనీ , దాంతో రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు భోజనం చేసి, మళ్లీ తెల్లవారి ఉదయం ఆరు గంటలకు టిఫిన్ చేసేదాన్ననీ , 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం వల్ల తన చర్మకాంతి మెరుగైందనీ , చక్కగా నిద్రపట్టేదనీ, గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నాననీ తమన్నా తన బ్యూటీ సీక్రెట్ ను వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: