“1:నేనొక్కడినే ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్, బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి కథానాయికగా రూపొందిన “మిమి “, హమ్ దో హమారే దో “, “భేడియా ” మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న “బచ్చన్ పాండే “మూవీ లో కృతి కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో సీత పాత్రలో నటిస్తున్న కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.టోఫీ కలర్ డ్రెస్‌లో స్లీవ్‌లెస్ టాప్ లో గాలికి ఎగురుతున్న కురులతో కృతి కెమెరాకు స్టన్నింగ్ గా ఫోజులిచ్చారు. చాక్లెట్ కలర్ లో ముగ్దమనోహరమైన సౌందర్యంతో ఉన్న తన ఫొటోస్ ను కృతి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: