సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , హిందీ , మలయాళ భాషల “మేజర్ “మూవీ టీజర్ కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. మూడు భాషల టీజర్ యూట్యూబ్ లో 32 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో అడివి శేష్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “మేజర్ “మూవీ రిలీజ్ డేట్ జూలై 2 గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయి విడుదల వాయిదా పడింది “మేజర్ “మూవీ విడుదల తేదీ పై తాజాగా నటుడు అడివి శేష్ స్పందించారు. హిందీ లో థియేటర్లు మొదలైన తర్వాత ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ ను ఇస్తామని చెప్పారు. సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు “మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ “HIT “మూవీ సీక్వెల్ “HIT 2 ” మూవీ లో అడివి శేష్
కథానాయకుడిగా నటిస్తున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























