హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విశాల్ హైదరాబాద్‌లో షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. విశాల్ 31వ చిత్రం “నాట్ ఏ కామన్‌మ్యాన్”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఎస్ కుర్ నిర్మాతగా మినీ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్ , ఆర్య హీరోలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ ” మూవీ ఒక సాంగ్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను హైదరాబాద్ లో 9వ తేదీ నుండి దర్శకుడు ప్రారంభించారు. యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’ చిత్రం షూటింగ్ పూర్తి అయిన
సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ “ఎనిమీ’”చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశామనీ , ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్ చేసినందుకు ఆనందంగా ఉందనీ , పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామనీ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుందని నిర్మాత వినోద్‌కుమార్ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























