ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన రామ్ ప్రస్తుతం ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడ విదితమే. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చాడు రామ్. ఫైనల్ గా నెరేషన్ పూర్తయిందని లింగుస్వామి సార్ లవ్ యూ.. రోల్ ద కెమెరా అంటూ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నాడో తెలిపాడు.
Final Narration Done & How!!! @dirlingusamy love you sir!! Super duper kicked!!! Roll that camera I say!!! 🔥@SS_Screens @ThisIsDSP @IamKrithiShetty #RAPO19
— RAm POthineni (@ramsayz) June 24, 2021
కాగా నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























