సెలబ్రిటీస్ పై ఫేక్ న్యూస్ రావడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు వచ్చినా సోషల్ మీడియా ప్రభావం అంత లేదు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అలా న్యూస్ వస్తే ఇలా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. దీంతో సెలబ్రిటీలు కూడా ఆ వార్తలపై స్పందించక తప్పడంలేదు. ఇప్పటికే అలాంటి ఫేక్ న్యూస్ పై ఎంతోమంది స్పందించగా… ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆవార్తలపై సీరియస్ అవుతుంది. అసలు రకులు అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో ఉన్నాయని.. వరుస షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంటున్నాను. కొన్నిసార్లు డేట్స్ కూడా సర్దుబాటు కావడం లేదు. డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతోనే తెలుగు ప్రాజెక్ట్‌లకు నో చెప్పాల్సి వస్తుంది’ అని రకుల్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడివరకూ బాగానే ఉన్నా రకుల్ ఇంటర్వ్యూ ఆధారంగా పలు వార్తలు వచ్చాయి. కానీ రకుల్ చెప్పింది కాకుండా.. తెలుగు చిత్రాల్లో తనకు అవకాశాలు రావట్టేదు అని రకుల్ చెప్పినట్లు వార్త రాసుకొచ్చారు. దీంతో రకుల్ ఆ వార్తలను ట్యాగ్ చేస్తూ మరీ కౌంటర్ ఇచ్చింది. వీళ్లు హెడ్డింగ్‌లో పెట్టినట్లు.. టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని ఎప్పుడు చెప్పాను. ఒక ఏడాది అనగా 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాలు కాకుండా కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఆ విషయంలో మా టీమ్‌కి సాయం చేయండి’ అని ఆమె రాసుకొచ్చింది. మరి దీంతో తనకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి అన్నవాళ్లకి కూడా కౌంటర్ ఇచ్చింది రకుల్.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా అజయ్ దేవ్‌గన్, అమితాబ్ బచ్చన్, అంగిరాధర్ సినిమాల్లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























