ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. రిలీజ్ తో పాటు లాక్ డౌన్ కారణంగా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ మొదలవగా, అందులో భాగంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టినట్టు నటి మాళవిక అవినాష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్డేట్ ఇచ్చారు. ‘కేజీయఫ్ 1’ లో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Life May not have come back to normal…but some semblance of it! After 50days…work #FilmIndustry #PostCovid #SecondWave #kgfchapter2 pic.twitter.com/aPyOsK9Isn
— Malavika Avinash (@MalavikaBJP) June 16, 2021
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: