మెగాస్టార్ చిరంజీవిసేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఈ కరోనా కష్ట కాలంలో కూడా తన ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు తగిన సాయం అందించారు. ఇక ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు అంబులెన్స్ సర్వీస్ కూడా అందించాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా… చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా గత కొన్ని ఏళ్లుగా చిరంజీవి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ, ఆపదలో వున్న వారికి రక్తాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుండటం, ఏ సంబంధం లేని వారికి రక్తం ఇచ్చి వారితో ఓ రక్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అనేది గొప్ప అదృష్టం’ అంటూ ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It’s a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు చిరు లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే షూటింగ్ అయినా పూర్తి చేసుకొని ఉండేది. దీనితో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ చేయనున్నాడు. ఆతరువాత మెహర్ రమేష్.. బాబితో సినిమాలు చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























