కె.జి.యఫ్ 2 దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా వస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 16వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరిలో రిలీజ్ అయిన ఈటీజర్ ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ టీజర్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. దాదాపు టీజర్ 185 మిలియన్ వ్యూస్‌ను సాధించిన ఈటీజర్.. 8 మిలియన్ లైక్స్‌ను సాధించింది. ఇప్పుడు కె.జి.యఫ్ 2 టీజర్ పది లక్షల కామెంట్స్‌ను సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈవిషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
𝐏𝐨𝐰𝐞𝐫 𝐏𝐞𝐨𝐩𝐥𝐞 𝐌𝐚𝐤𝐞 𝐏𝐥𝐚𝐜𝐞𝐬 𝐏𝐨𝐰𝐞𝐫𝐟𝐮𝐥 🔥#KGFChapter2Teaser: https://t.co/3xoDtHZ0be@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena@SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84
1M COMMENTS FOR KGF2 TEASER
— Hombale Films (@hombalefilms) May 31, 2021
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు, రావు రమేష్ సీబీఐ పాత్రలో తమిళ నటుడు బాలకృష్ణ ఇనాయత్ ఖలీల్ అనే పాత్రల్లో నటించనున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: