తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖన్నా టాలీవుడ్ లో నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. 5 తమిళ , ఒక మలయాళం మూవీ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో తన ఫోటోషూట్ ఫొటోలతో అభిమానులను రాశీఖన్నా అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం అనివార్యం . అయినా కొందరు మాత్రం మాస్కులు ధరించడం లేదు, భౌతిక దూరం పాటించడం లేదు . సోషల్ మీడియా లో అలాంటి వారికి రాశీ ఖన్నా ఒక పోస్ట్ పెట్టారు. మనం పోతే ఆ బాధ మనకు తెలియదనీ , వేరే వాళ్ళకు తెలుస్తుందనీ , దయచేసి మాస్కులు ధరించండి అని రాశీ ఖన్నా కోరారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























