ఒకప్పుడు ఒక హీరో-హీరోయిన్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతూనే ఉండేవి. అలా మన తెలుగు సినీ చరిత్రలో చాలా హిట్ పెయిర్సే ఉండేవి. ఇప్పుడంటే కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కాబట్టి హీరో-హీరోయిన్స్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం తగ్గిపోయింది. కానీ ఈతరంలో కూడా కొన్ని హిట్ కాంబినేష్స్ ఉన్నాయి. ఎన్టీఆర్-సమంత కలిసి నాలుగు సినిమాలు చేశారు.. అలాగే కాజలే తో చరణ్, అల్లు అర్జున్ మూడు నాలుగు సినిమాలు చేశారు.. పవన్ తో శృతి హాసమ్ ఇలా కొన్ని హిట్ పెయిర్స్ రిపీట్ అవతూనే ఉన్నాయి. ఇక ఈమధ్యకాలంలో యూత్ కు నచ్చిన హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక ది అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఇద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. అందులో గీత గోవిందం బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు 100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. అందుకే అభిమానులు మళ్ళీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నిర్వహించగా.. ఒక అభిమాని ఇదే ప్రశ్న అడుగగా.. దానికి రష్మిక ఆ విషయం విజయ్‌ని అడగండి.. మంచి కథ వస్తే మేమిద్దరం కలిసి నటించడానికి రెడీగానే ఉన్నామని తెలిపింది. మరి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కోసం ఎవరు కథను రెడీ చేస్తారో చూడాలి.
ఇక ప్రస్తుతం రష్మిక బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈసినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలోనే నటిస్తుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది ఈ అమ్మడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























