గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరైనోడు”మూవీ 2016 సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ ట్రెసా కథానాయికలు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. శ్రీకాంత్ , ఆది పినిశెట్టి ముఖ్యపాత్రాలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫైట్స్ , డ్యాన్స్ లలో తనదైన మార్క్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సరైనోడు “మూవీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. “సరైనోడు “మూవీ తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ గా నిలిచిందనీ , దర్శకుడు బోయపాటి , రకుల్ , కేథరిన్ , ఆది , సంగీత దర్శకుడు థమన్ , గీతా ఆర్ట్స్ కు థ్యాంక్స్ అనీ , వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీ ని అందించిన నటీనటులు , సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























