సక్సెస్ ఫుల్ “ముకుంద “మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం “గని “, “F 3 ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. “గని “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.“గని”మూవీ లోని బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ప్రత్యేక బాక్సింగ్ సెట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు కిరణ్ తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న వరుణ్ తేజ్ తాజాగా కాఫీ టేబుల్ వద్ద రిలాక్స్ మోడ్ లో ఏదో ఆలోచిస్తూ ఉన్న ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























