యాక్టర్ ,డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తనయ సాయీ మంజ్రేకర్ , స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందిన “దబంగ్ 3” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయీ 2 తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ ” మూవీ జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సాయీ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న “గని “మూవీ లో సాయీ కథానాయికగా నటిస్తున్నారు. “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. సాయీ హీరోయిన్ గా నటించిన “మేజర్ “, “గని “మూవీస్ ఒకే నెలలో రిలీజ్ కావడం విశేషం. సాయీ కథానాయికగా నటించిన రెండు మూవీస్ రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఈ బ్యూటీ టాలీవుడ్ యంగ్ హీరోలకు సరైన జోడీగా సూటవుతుందని టాలీవుడ్ టాక్.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























