పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ తో పాటు యువ హీరోలతో జంటగా నటించి పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “దువ్వాడ జగన్నాథం “, “అల .. వైకుంఠపురములో ..”మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో పూజాహెగ్డే మాట్లాడుతూ .. హీరో అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ , అతనిని తెలుగు మైకేల్ జాక్సన్ గా అభివర్ణించారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























