పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ , అనన్య పాండే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్” మూవీ సెప్టెంబర్ 9వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “లైగర్ “మూవీ షూటింగ్ COVID-19 కారణంగా నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
”లైగర్”మూవీ షూటింగ్ చాలా గ్యాప్ తరువాత ముంబై లో ప్రారంభం అయ్యింది. ”లైగర్”మూవీ టీమ్ సెట్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబై లో షూటింగ్స్ , పార్టీస్ కామన్ దర్శకుడు పూరి జగన్నాథ్ , నిర్మాతలు ఛార్మి , కరణ్ జోహార్ , విజయ్ దేవరకొండ , అనన్య పాండే , మనీష్ మల్హోత్రా సెట్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఛార్మి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ”లైగర్”మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో రిలీజ్ కానుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న”లైగర్”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: