గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్, సముద్ర ఖని , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. ముఖ్యం గా “బుట్టబొమ్మ “, “రాములో రాములా ” “సామజవరగమన” సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన అర్మాన్ మాలిక్ గానం చేసిన “బుట్టబొమ్మ “సాంగ్ కు హీరో అల్లు అర్జున్ , పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈదశాబ్దపు మోస్ట్ వైరల్ సాంగ్ గా “బుట్టబొమ్మ “సాంగ్ ను మిర్చి అవార్డ్స్ ఎంపిక చేసి గాయకుడు అర్మాన్ మాలిక్ కు అవార్డ్ అందజేసింది. ఆ విషయాన్ని గాయకుడు అర్మాన్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























