“చాంద్ సా రోషన్ చెహ్రా” (2005 ) బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన తమన్నా సక్సెస్ ఫుల్ “శ్రీ “(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు . తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా సౌత్ ఇండియన్ స్టార్ హీరో మహేష్ బాబు , బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా తన ఫేవరేట్ స్టార్స్ అంటూ తెలిపారు. “ఆగడు “మూవీ లో మహేష్ బాబు కు జంటగా నటించిన తమన్నా
బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ లో మహేష్ బాబు తో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా తన సినీ కెరీర్ లో తెలుగు , తమిళ , హిందీ భాషలలో 65 మూవీస్ కు పైగా నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























