అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా చిత్రంలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ‘పాప ఓ పాప.. నీ పేరు తలచి నేను మజునునయ్యానే’ అంటూ సాగే ఈపాటను టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సాంగ్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన విజయ్.. పాప ఓ పాప సాంగ్ చూసి ఎంజాయ్ చేయండని తెలుపుతూ ‘గాలి సంపత్’ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Launching #PapaOPapa 😊
Listen and enjoy!https://t.co/0NiaTywselWishing #DrRajendraPrasad garu @sreevishnuoffl @AnilRavipudi #Anish @achurajamani @ramjowrites @YoursSKrishna and the team of #GaaliSampath all success and happiness :))#GaaliSampathOnMarch11th
— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2021
కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ఎస్. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























