యూవీ క్రియేషన్స్ .. ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్స్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.ఇక ఆతర్వాత శర్వానంద్ తో రన్ రాజా రన్, నానితో భలే భలే మగాడివోయ్, అనుష్కతో భాగమతి, ప్రభాస్ తో సాహో ఇలా బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించింది. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒక పక్క పెద్ద సినిమాలు చేస్తూనే మరోపక్క చిన్న సినిమాలపై కూాడా దృష్టిపెట్టింది ఈ నిర్మాణ సంస్థ. ఈ నేపథ్యంలో యూవీ కాన్సెప్ట్స్ అంటూ మరో వింగ్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సినిమాలను నిర్మించాలని చూస్తుంది. ఈ యూవీ కాన్సెప్ట్స్ నుండి ఒక సినిమా కూడా రాబోతుంది. నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మినీ లుక్ ను 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
View this post on Instagram
డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోడల్, నటి కావ్య థాపర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























