మొదటి సినిమా ‘మత్తు వదలరా’ లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితోపాటు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు శ్రీ సింహ. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా భాగ్ సాలే అనే సినిమా చేస్తున్నాడు శ్రీ సింహ. ఈ రోజు శ్రీసింహా బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు చిత్రయూనిట్.

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను మార్చి మూడో వారం నుంచి ప్రారంభంకానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























