తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ కు వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తాజాగా మరో సినిమాలో జయమ్మ మంచి పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేద వ్యాస్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఇక ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు.. ఆమె పాత్ర చాలా ఇంటెన్స్ తో ఉంటుందని.. ఆమె పాత్ర చుట్టూ చాలా ట్విస్ట్ లు వుంటాయని చెపుతున్నాడు వేదవ్యాస్.
కాగా సందీప్ కిషన్ తో వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంతకు ముందే స్క్రీన్ షేర్ చేసుకుంది. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమాలోనే వీరిద్దరూ కలిసి నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: