యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సత్య దేవ్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మాత సృజన్ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటితో పాటు గాడ్సే సినిమా కూడా చేస్తున్నాడు. సత్య దేవ్ కు బ్లఫ్ మాస్టర్ లాంటి డిఫరెంట్ కథను అందించిన డైరెక్టర్ తోనే ఈ సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడాప్రారంభించేసాడు. ఈ విషయాన్ని సత్యదేవ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నేడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.
#GODSE begins
This will be something…
Need your unconditional love and never ending support. @MeGopiganesh @AishwaryaLeksh4 #ckalyan @kasyapsunil6 #suresh pic.twitter.com/Us7Ojh0xG6— Satya Dev (@ActorSatyaDev) February 11, 2021
కాగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. సికే స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: