మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేరు ‘నిన్నిలా నిన్నిలా’. ప్రముఖ తమిళ నటుడు, ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ , టీజర్ విడుదల కాగా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మెగా హీరో సాయి తేజ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే.. కామెడీ, ఎమోషన్స్, లవ్ అన్నీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరో అశోక్ సెల్వన్ చెఫ్ పాత్రను పోషిస్తున్నాడు.
Happy to Launch the super fun & gripping trailer of #NinnilaNinnila
My Best wishes to @BvsnP garu, #Baapi anna & the entire team. Good Luck🤞Watch Here ▶️ https://t.co/US8L6HYpBj@AshokSelvan @MenenNithya @riturv @AniSasiOnO @RajeshMRadio @SVCCofficial @ZeeplexOfficial
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 5, 2021
కాగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, జీ స్టూడియోస్లపై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లండన్ నేపథ్యంలో జరిగిన థ్రిల్లర్ సినిమా కావడంతో.. అక్కడే షూటింగ్ మొత్తం జరుపుకున్నట్టు తెలుస్తుంది. నాజర్ సత్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా.. నేరుగా ఫిబ్రవరి 26 ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































