‘బంగారు బుల్లోడు’ కోసం ఆ పనులు నేర్చుకున్నా..!

Allari Naresh Reveals Some Interesting Inside Stories About His Latest Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Bangaru Bullodu Trailer,Allari Naresh,Allari Naresh New Movie,Bangaru Bullodu,Allari Naresh,Actor Allari Naresh,Hero Allari Naresh,Allari Naresh About His Latest Movie,Allari Naresh About His Role In Bangaru Bullodu,Allari Naresh About Bangaru Bullodu Role,Allari Naresh Goldsmith Work,Allari Naresh Reveals Inside Stories About Bangaru Bullodu,Allari Naresh About His Latest Movie,Allari Naresh Bangaru Bullodu Movie Details

గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న అల్లరి నరేష్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో నేను బంగారు ఆభరణాలు తయారుచేసే గోల్డ్‌స్మిత్‌ పాత్రలో కనిపిస్తాను. ఓ గ్రామీణ బ్యాంకులో బంగారు తాకట్టు విభాగంలో పనిచేస్తూ ఆభరణాల నాణ్యత ఏమిటో నిర్ధారించడం నా పని. ఈ సినిమాలో తనికెళ్ల భరణిగారు నాకు తాత పాత్రలో కనిపిస్తారు. షూటింగ్‌ టైమ్‌లో ఆయన ‘గోల్డ్‌స్మిత్‌ పాత్ర కోసం ఆ విద్య గురించి కొంచెం తెలుసుకుంటే మంచిది’ అని సూచించారు. దాంతో ఈ సినిమా కోసం బంగారానికి మెరుగులుదిద్దడం, అతుకులు వేయడం వంటి పనుల్ని నేర్చుకున్నా అంటూ తెలిపాడు.

కాగా పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, ప్రభాస్‌ శ్రీను, జబర్దస్త్‌ మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.