తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ “ఆచార్య ” మూవీ తో పాటు”మోసగాళ్ళు “, తమిళ మూవీస్ “ఇండియన్ 2 “, హే సనామికా “, “ముంబై సాగ (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. అక్టోబర్ 30 వ తేదీ కాజల్ వివాహం తన మిత్రుడు గౌతమ్ తో జరిగిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హానీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న “ఆచార్య “మూవీ షూటింగ్ లో పాల్గొని కాజల్ తన షూటింగ్ పార్ట్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




వివాహానంతరం కాజల్ అగర్వాల్ ఒక కొత్త తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “గులేబగావళి ” మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వంలో యాక్టర్ , కొరియోగ్రాఫర్ , డైరెక్టర్ ప్రభుదేవా , కాజల్ అగర్వాల్ జంటగా ఒక తమిళ మూవీ తెరకెక్కనుంది. ప్రభుదేవా , కాజల్ ఫస్ట్ టైమ్ జోడీగా నటించనున్నారు. కొత్త కాంబినేషన్ లో రూపొందే ఈ మూవీ పై ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రభుదేవా ప్రస్తుతం 5 తమిళ సినిమాలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా “రాధే “హిందీ మూవీ తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























