స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“RED” మూవీ లో హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సంక్రాంతి పండగ కు ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ తమిళ మూవీ “తడమ్ “కు తెలుగు రీమేక్ గా “RED” మూవీ రూపొందింది. రిలీజ్ అయిన 3రోజుల్లోనే 13.21 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. “RED” మూవీ సక్సెస్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ వైజాగ్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. సక్సెస్ మీట్ లో హీరోయిన్ మాళవికశర్మ మాట్లాడుతూ .. స్రవంతి మూవీస్ లో వర్క్ చేయడం ఆనందంగా ఉందనీ, ఈ మూవీ లో మహిమ పాత్రలో నటించడంతో ప్రేక్షకులు ఆ పేరుతో పిలవడం ప్రారంభించారనీ, హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యాననీ, ఈ సూపర్ హిట్ మూవీ లో తనను కూడా భాగం చేసినందుకు దర్శకుడు కిషోర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























