కామర్స్ డిగ్రీ హోల్డర్, మోడల్ అమృత అయ్యర్ “పడై వీరన్”తమిళ మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “బిగిల్ “తమిళ మూవీ తో అమృత గుర్తింపు పొందారు. స్టార్ యాంకర్ ప్రదీప్ హీరోగా రూపొందిన “30 రోజులలో ప్రేమించడం ఎలా ?” మూవీ లో అమృత కథానాయికగా నటించారు. ఆమూవీ జనవరి 29 వతేది రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన “రెడ్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. “రెడ్ ” మూవీ లో ముగ్గురు కథానాయికలలో ఒకరిగా అమృత అయ్యర్ నటించారు. ఒకే నెలలో రెండు మూవీస్ తో అమృత తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ రెండు మూవీస్ విజయం సాధిస్తాయనే కాన్ఫిడెన్స్ తో అమృత ఉన్నారు. మరిన్ని తెలుగు మూవీస్ లో నటించాలనే ఆశాభావం అమృత వ్యక్త పరిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: