కమెడియన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన సునీల్ సక్సెస్ ఫుల్ మూవీ “అందాలరాముడు”మూవీ తో హీరోగా మారారు. సునీల్ హీరో గా రూపొందిన “మర్యాద రామన్న “, “పూల రంగడు “,”తడాఖా “మూవీస్ ఘనవిజయం సాధించాయి. సునీల్ హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు పరాజయం పొందడం తో సునీల్ తిరిగి కమెడియన్ గా నటిస్తున్నారు. “కలర్ ఫోటో “మూవీ లో నెగటివ్ రోల్ లో నటించి సునీల్ ప్రేక్షలకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సునీల్ హీరోగా కమ్ బ్యాక్ మూవీ “వేదాంతం రాఘవయ్య “మూవీ రూపొందుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై సి చంద్ర మోహన్ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందుతున్న మూవీ “వేదాంతం రాఘవయ్య ” షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. “వేదాంతం రాఘవయ్య ” మూవీ కి హరీష్ శంకర్ స్టోరీ అందిస్తున్నారు. సునీల్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































