7 భాషల్లో రామ్ ‘రెడ్’ రిలీజ్

Red Movie To Release Worldwide Across Seven Languages,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Red,Red Movie,Red Telugu Movie,Red Movie Release Worldwide,Ram Pothineni RED Telugu Movie Release Worldwide,RED Movie Updates,RED Telugu Movie Latest News

నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠి, తమిళంతో పాటు హిందీలోకి కూడా రిలీజ్ చేయనున్నారు దర్శకనిర్మాతలు. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్‌లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. తమిళ వెర్షన్‌ని మాత్రం డైరెక్ట్‌గా ఓటిటిలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.