‘ట‌క్ జ‌గ‌దీష్’ డబ్బింగ్ మొదలు

Natural Star Nani Starts Dubbing For Tuck Jagadish Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Hero Nani,Natural Star Nani,Actor Nani,Nani New Movie,Shiva Nirvana,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Film,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Telugu,Nani Begins Dubbing For Tuck Jagadish,Tuck Jagadish Movie Dubbing,Nani Begins Tuck Jagadish Dubbing

వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీలో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి ‘ సినిమా తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌డానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు. 2021 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరి ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో మరో హిట్ ను వీరి ఖాతాలో వేసుకుంటారో.. లేదో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.