ఈ ఏడాది హీరో నితిన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘రంగ్ దే’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. రేపు అంటే జనవరి 3వ తారీకున ఉదయం 10 గంటలకు ‘చెక్’ నుండి మొదటి గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన ఇచ్చారు చిత్రయూనిట్. కాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
@yeletics @Rakulpreet @bhavyacreations #priyawarrier #kalyanimalik pic.twitter.com/PBX7QWTzuO
— nithiin (@actor_nithiin) January 1, 2021
ఇక నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. మరి 2021 లో నితిన్ మూడు సినిమాలతో సందడి చేసేలా ఉన్నాడు.
మరి ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, మనమంతా..వంటి చిత్రాలతో డైరెక్టర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. మరి నితిన్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూద్దాం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే అంధాధున్ తెలుగు రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























