సక్సెస్ ఫుల్ “శ్రీ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే (డిసెంబర్ 21 ) సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం “, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ “F 2 ” మూవీ సీక్వెల్ “F 3 “లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథానాయిక గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2 ” మూవీస్ లో దేవసేన గా అనుష్క , అవంతిక గా తమన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో లక్ష్మి గా తమన్నా , ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అనుష్క తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. తామిద్దరి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అనుష్క , తమన్నా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































