సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే సినిమాల్లో కె.జి.ఎఫ్ 2 ఒకటి అని కూడా చెప్పొచ్చు. ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచానాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయింది చిత్రయూనిట్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. డిసెంబర్ 21న ఈ సినిమానుండి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలిపాడు ప్రశాంత్ నీల్. మరి సర్ప్రైజ్ అంటే టీజర్ అయి ఉంటుందేమో అన్న అభిప్రాయాలు అప్పుడే వస్తున్నాయి. మరి చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో..
Here’s the much anticipated news of the year! The wait is over! This is for all our crazy fans out there. #KGFChapter2@VKiragandur @TheNameIsYash @prashanth_neel @hombalefilms @duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @Karthik1423 pic.twitter.com/Z7EdeXkzjG
— Prashanth Neel (@prashanth_neel) December 19, 2020
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























