‘వివాహ భోజనంబు’ టీజర్ రిలీజ్

Telugu Filmnagar, Tollywood Updates, Vivaha Bhojanambu Movie Teaser, Vivaha Bhojanambu Teaser, Vivaha Bhojanambu Teaser Out Now, Vivaha Bhojanambu Teaser Released, Vivaha Bhojanambu Telugu Movie, Vivaha Bhojanambu Telugu Movie News, Vivaha Bhojanambu Telugu Movie Teaser, Vivaha Bhojanambu Telugu Movie Teaser Out, Vivaha Bhojanambu Telugu Movie Updates

సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాతో పాటు రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో వివాహ భోజనంబు సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ కాదు. కమెడియన్ సత్య హీరోగా చేస్తున్నాడు. అయితే ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా హీరోని పరిచయం చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేశాడు. టీజర్ బట్టి కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రూపొందిన వినోదాత్మక చిత్రమిది అని అర్థమవుతోంది. సత్య పిసినారి పాత్రలో నటిస్తున్నాడు. లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది కథ.

కాగా వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్‌ కిషన్‌, శినీష్, కిరణ్‌ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.