మల్లీ హ్యాపీ బర్త్ డే.. అల్లాడించేద్దాం..!

Actor Karthikeya News, Actress Lavanya Tripathi, Hero Karthikeya, Karthikeya, Karthikeya Gummakonda, Karthikeya Gummakonda Sends Out Birthday Wishes To Lavanya Tripathi, Karthikeya Gummakonda Sends Out Birthday Wishes To Lavanya Tripathi On Twitter, Karthikeya movies, Lavanya Tripathi, Lavanya Tripathi Birthday, Lavanya Tripathi Latest News, Lavanya Tripathi Upcoming Project

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి కరోనా నిబంధనలతో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి సినిమా చేస్తుండగా మల్లిక పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. అంతేకాదు కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇక కార్తికేయ కూడా లావణ్యకు కాస్త కామెడీగా ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేశాడు. ఆ పోస్టర్‌ను షేర్ చేసిన హీరో కార్తికేయ.. `మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా.. చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని అట్టుకొత్తా.. అల్లాడించేద్దాం అంతే` అని ట్వీట్ చేశాడు.

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈసినిమాతో పాటు లావణ్య త్రిపాఠి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో “A1 ఎక్స్ ప్రెస్ ” సినిమాలో నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.