తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం లో తమిళ భాష , గిటార్ ను రాశీఖన్నా నేర్చుకున్న విషయం తెలిసిందే. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. 4 తమిళ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. హృదయం లోని భావాలను వ్యక్తీకరించడానికి కవిత్వం మంచి సాధనం అనిచెబుతూ రాశీఖన్నా .. స్కూల్ డేస్ నుండీ కవిత్వం పై అభిరుచి కలిగిందనీ , ఏ కారణంగా నైనా తన హృదయం సంఘర్షణకు లోనైతే ఆ ఆవేదనను అక్షరాలలో తీసుకొస్తాననీ, దాంతో మనసుకు స్వాంతన కలిగిన భావన కలుగుతుందనీ , వృత్తి పరంగా అలసిపోతే కలం పట్టి కవిత్వంలో సేద తీరుతాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























