కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పెళ్లి చూపులు కామెడీ సీన్స్

పెళ్లి చూపులు కామెడీ సీన్స్

Watch these back to back comedy scenes from Pelli Choopulu Movie

చిన్న సినిమాలతో తమ కెరీర్ నే మార్చేసుకున్న నటీ నటులు, దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో పెళ్లి చూపులు సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తూనే వున్నాం. హీరోయిన్ గా చేసిన రీతువర్మ కూడా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నా చావు నేను చస్తా అనే బుక్ రాస్తానని చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమా నుండి కామెడీ సీన్స్ మీకోసం చూసి నవ్వుకోండి.

కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజ్ కందుకూరి, యాష్ రంగినేని నిర్మించారు. ఈ సినిమాలో ఇంకా నందు, అనీష్ కురువిల్లా, గురురాజ్ మానేపల్లి, ప్రియదర్శి తదితరులు నటించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించాడు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందించాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్